ఇక ఎన్నికలకు సిద్ధంకండి.. వైసీపీ సమావేశం ముఖ్య వివరాలు ఇవే..

ఇక ఎన్నికలకు సిద్ధంకండి.. వైసీపీ సమావేశం ముఖ్య వివరాలు ఇవే..
x
Highlights

భవిశ్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ వైసీపీ అధినేత వైయస్ జగన్ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలకు,...

భవిశ్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ వైసీపీ అధినేత వైయస్ జగన్ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. మరో నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో.. జనవరి నాటికి సర్వం సిద్ధంగా ఉండాలని జగన్‌.. పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు ప్రతిరోజూ రెండు బూత్‌లలో పర్యటించి గడగడపనూ సందర్శించాలని జగన్‌ పేర్కొన్నారు. వారానికి ఐదు రోజుల పాటు ఆయా బూత్‌లకు చెందిన కార్యకర్తలు.. స్థానిక ఓటర్లతో మమేకం అవ్వాలని కోరారు. అలాగే ప్రతీ 30 నుంచి 35 కుటుంబాలకు ఒక బూత్‌ కమిటీ సభ్యుడు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు. అంతేకాకుండా 'రావాలి జగన్, కావాలి జగన్' అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని వైసీపీ నాయకులు సమావేశంలో తీర్మానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories