ఘనంగా వై.ఎస్.జగన్ జన్మదిన వేడుకలు

ఘనంగా వై.ఎస్.జగన్ జన్మదిన వేడుకలు
x
Highlights

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకుల అభిమానుల మధ్య జరుపుకున్నారు. పాదయాత్రలోనే బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు జగన్. జగన్ కు ఏపీ...

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకుల అభిమానుల మధ్య జరుపుకున్నారు. పాదయాత్రలోనే బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు జగన్. జగన్ కు ఏపీ సీఎం చంద్రబాబు, ఎంపీ కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య జరుపుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ టెక్కలి నియోజకవర్గంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు జననేతను ఆశీర్వదించారు. పుట్టిన రోజు సందర్భంగా పాదయాత్రలో ఉన్న జగన్ ను తల్లి విజయమ్మ ఆశీర్వదించారు. పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి పలువురు పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన ఆయన.. నిండు ఆరోగ్యం, ఆనందాలతో హాయిగా ఉండాలంటూ ట్వీట్ చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘జగన్ అన్నా మెనీ మెనీ హ్యాప్పీ రిటర్న్స్ ఆఫ్ ది డే’ అని ట్వీట్ చేశారు. కవిత శుభాకాంక్షలకు జగన్ స్పందిచారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కవితకు ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు కవితమ్మా అని తన ట్విటర్ ద్వారా జవాబిచ్చారు జగన్. రాజకీయ నాయకులు ఒకరినొకరు ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడం సహజమే అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్‌కు కవిత చేసిన ట్వీట్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories