వైఎస్‌ జగన్‌ను కలిసిన సినీ నటుడు భానుచందర్‌

వైఎస్‌ జగన్‌ను కలిసిన సినీ నటుడు భానుచందర్‌
x
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ ను సినీ నటుడు భానుచందర్ కలిశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను కలిసిన భానుచందర్ ఆయనతో...

వైసీపీ అధినేత వైయస్ జగన్ ను సినీ నటుడు భానుచందర్ కలిశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను కలిసిన భానుచందర్ ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. 329వ రోజు పాదయాత్రను ఆదివారం టెక్కలి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి గూడెం, సన్యాసి నీలాపురం, దామర, రాంపురం క్రాస్‌, నర్సింగపల్లి, జగన్నాధపురం, కుంచుకోట మీదుగా పాతపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. కాగా నేటితో జగన్ 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసుకున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన జగన్ తన యాత్రను ముంగించనున్నారు. అనంతరం పాదయాత్ర కవర్ చేయని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇందుకోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు ఆ పార్టీ నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories