మెగాస్టార్ చిరంజీవికి పేద్ద.. చాక్లెట్ పంపిన వైయస్ భారతి

మెగాస్టార్ చిరంజీవికి పేద్ద.. చాక్లెట్ పంపిన వైయస్ భారతి
x
Highlights

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్ సతీమణి భారతి.. మెగాస్టార్ చిరంజీవికి ఓ పేద్ద చాక్లెట్ పంపారు.. అయితే అది అయన జన్మదినం కోసం...

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్ సతీమణి భారతి.. మెగాస్టార్ చిరంజీవికి ఓ పేద్ద చాక్లెట్ పంపారు.. అయితే అది అయన జన్మదినం కోసం కాదు. ఇటీవల భారతి సొంత ఛానల్ ఓ అవార్డు కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందులో జీవిత సాఫల్య పురష్కారం, బెస్ట్ యాక్టర్ వంటి పలు అవార్డుల ప్రధానం జరిగింది. 2017 కి గాను మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 కి బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. దీంతో షూటింగ్ లో బిజీగా ఉన్న మెగాస్టార్.. ఆ అవార్డు ఫంక్షన్ కు వెళ్లలేకయారట. ఈ క్రమంలో చిరు ఇంటికి అవార్డు తోపాటు ఒక పేద్ద.. చాక్లెట్ ను వైయస్ భారతి పంపించారు. ఆ సందర్బంగా భారతికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 'నా సోదరి పంపిన ఈ అవార్డును జీవితకాలం గుర్తుంచుకుంటూ' అంటూ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories