బ్యూటీ పార్లర్‌లో చేరినరోజే యువతి అనుమానాస్పద మృతి!

బ్యూటీ పార్లర్‌లో చేరినరోజే యువతి అనుమానాస్పద మృతి!
x
Highlights

గుంటూరు జిల్లాలోని ఓ బ్యూటీ పార్లర్‌లో యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది.తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకకు గ్రామానికి...

గుంటూరు జిల్లాలోని ఓ బ్యూటీ పార్లర్‌లో యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది.తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకకు గ్రామానికి చెందిన జి.సిరి (18) బుధవారం ఉదయమే రేపల్లెలోని ‘డూ ఆర్‌ డై బ్యూటీ పార్లర్‌’లో చేరింది. అయితే సాయంత్రం సడన్ గా పార్లర్‌ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఉరి వేసుకుని చనిపోయిందని పార్లర్ సిబ్బంది చెబుతున్నా.. అక్కడ ఆ అనవాళ్లు లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆరుగురు యువతులతో బ్యూటీ పార్లర్‌ నడుపుతున్న నిర్వాహకురాలు సింధు హైదరాబాద్‌లో ఉంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories