డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో యువతి హల్చల్

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో యువతి హల్చల్
x
Highlights

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో భాగంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు...

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో భాగంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికీ పోలీసులు జరిమానా విధించారు. ఈ క్రమంలో ఓ యువతి పట్టుబడింది. ఆమెకు పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించగా ససేమిరా అంది. దీంతో చాలాసేపు పోలీసులకు, సదరు యువతికి మధ్య వాగ్వాదం జరిగింది.రెండు గంటల పాటు ఆమెకు డ్రంక్ డ్రైవ్ పరీక్షలు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను విచారించగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తేనంటూ సమాధానం చెంప్పింది. అలాగే తాను ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతున్నానని తెలిపింది. కారును సీజ్‌ చేసిన పోలీసులు.. ఆమెపై బీఏసీ కౌంట్‌ 141గా కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories