భార్య ప్రచారానికి బలైపోయిన భర్త!

భార్య ప్రచారానికి బలైపోయిన భర్త!
x
Highlights

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తికి 23 ఏళ్ళు వివాహం జరిగింది.అయితే అనూహ్యంగా భార్య చేస్తున్న ప్రచారానికి తనను తానే బలితీసుకున్నాడు.. వివరాల్లోకి వెళితే...

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తికి 23 ఏళ్ళు వివాహం జరిగింది.అయితే అనూహ్యంగా భార్య చేస్తున్న ప్రచారానికి తనను తానే బలితీసుకున్నాడు.. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన కేతరాజుపల్లి వెంకటేశ్వర్లు కు అదే ఊరికి చెందిన యువతితో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. కాగా పిడుగురాళ్ల పట్టణం రావెళ్ల హోటల్‌ బజారులో భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం వీరికి పిల్లలు లేరు. ఇకపై పుట్టరనే అపనమ్మకంతో భార్య చేయకూడని పని చేసి పరోక్షంగా భర్త మరణానికి కారకురాలైంది. ఇరుగుపొరుగు వారికీ తమకిక పిల్లలు పుట్టరని, పైగా తన భర్తకు జన్యు పరమైన లోపం ఉందని ప్రచారం చేసింది. ఆ విషయం భర్త వెంకటేశ్వర్లుకు తెలిసి పలుమార్లు ఆమెను మందలించాడు. అయినా వినని భార్య ప్రచారం చేస్తూనేవుంది. దీంతో విసుగు చెందిన వెంకటేశ్వర్లు పక్కవీధిలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. స్నేహితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెంకటేశ్వర్లు మృతికి పరోక్షంగా కారకురాలైన అతని భార్యను విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories