ఆ నియోజకవర్గంలో వైసీపీకి వింత పరిస్థితి..

ఆ నియోజకవర్గంలో వైసీపీకి వింత పరిస్థితి..
x
Highlights

వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలనే లక్షంగా ప్రతిపక్షం వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర అంటూ జనాల్లో వుంటున్నారు...

వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలనే లక్షంగా ప్రతిపక్షం వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర అంటూ జనాల్లో వుంటున్నారు పార్టీ అధినేత వైయస్ జగన్. అయితే వివిధ నియోజక వర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్.. ప్రకాశం జిల్లాలోని దర్శికి మాత్రం ఎవరిని పోటీకి దించాలా అని తర్జన భర్జన పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి మంత్రి శిద్దా రాఘవరావు చేతిలో స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. అయితే కుంటుంబ పరిస్థితుల దృష్ట్యా ఈసారి తాను పోటీ చేయలేనని.. ఇంకెవరినైనా చూసుకోవాలంటూ అధిష్టానానికి తేల్చి చెప్పారు. దాంతో పాదయాత్ర సందర్బంగా ప్రముఖ పారిశ్రామికవేత్త బాదం మాధవరెడ్డిని ఇంఛార్జిగా నియమించారు జగన్. అయితే ఏమైందో ఏమో.. నెల తిరగకుండానే నేనే నిలబడతాను.. డిసెంబర్ నుంచి కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను అంటూ మళ్ళీ సీన్ లోకి వచ్చారు శివప్రసాద్ రెడ్డి.

ఇటీవల జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి ఈ విషయం స్పష్టం చేశారు. అయితే దీనికి కారణం కార్యకర్తల ఒత్తిడి, క్యాడర్ ఎక్కడ దూరమైపోతదో అన్న ఆందోళనలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. శివప్రసాద్ రెడ్డి విషయాన్నీ జగన్ వద్ద ప్రస్తావించిన బాలినేని.. సరే శివ ఇష్టం అని జగన్ అన్నట్టు తెలుస్తోంది. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న సామెతతో ఈ పరిణామం ఇంఛార్జిగా ఉన్న మాధవరెడ్డికి రుచించలేదు. దాంతో ఇటీవల జరిగిన ఇంచార్జిల సమావేశానికి హాజరుకాలేదు. ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న అధిష్టానం.. వివరణ కోరగా.. టికెట్ సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు. శివప్రసాద్ రెడ్డి ఉండనంటేనే నేను ఉన్నాను మళ్ళీ ఇదేం ఫిటింగ్ అని మండిపడుతున్నారట. దీంతో ప్రస్తుతానికి ఈ నియోజకవర్గ బాధ్యతలను బాలినేని శ్రీనివాసరెడ్డి చూస్తున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories