ఎట్టకేలకు వైసీపీ ఎంపీలపై స్పీకర్ నిర్ణయం..

ఎట్టకేలకు వైసీపీ ఎంపీలపై స్పీకర్ నిర్ణయం..
x
Highlights

ఎట్టకేలకు వైసీపీ ఎంపీలపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా... ఐదుగురు వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్‌...

ఎట్టకేలకు వైసీపీ ఎంపీలపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా... ఐదుగురు వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించారు. ఏప్రిల్‌ 6 వ తేదీన పదవులకు రాజీనామాలు సమర్పించిన ఎంపీలు... వాటిని ఆమోదించాలంటూ స్పీకర్‌ను కోరారు. భావోద్వేగాల మధ్య తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని స్పీకర్‌ సూచించగా... జూన్‌ ఆరోతేదిన మరోసారి స్పీకర్‌తో భేటీ అయ్యారు ఎంపీలు. మరోసారి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. ఈ మేరకు స్పీకర్‌ అడిగిన రీకరన్ఫర్మేషన్‌ లేఖలను కూడా సమర్పించారు. అయితే స్పీకర్‌ విదేశీ పర్యటనకు వెళ్లడంతో వాటికి ఆమోదముద్ర పడడం ఆలస్యమైంది. తుది పరిశీలన అనంతరం.. స్పీకర్‌ సుమిత్ర ఐదుగురు వైసీపీ ఎంపీల రిసిగ్నేషన్లను ఆమోదించారు

Show Full Article
Print Article
Next Story
More Stories