గంట కొట్టడానికి వెళ్లి కోటిన్నర ఖర్చు పెట్టారు.. మా జీతాల గురించి మాట్లాడతారా?

గంట కొట్టడానికి వెళ్లి కోటిన్నర ఖర్చు పెట్టారు.. మా జీతాల గురించి మాట్లాడతారా?
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీకి రానివాళ్లకు జీతాలు ఎందుకని సీఎం...

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీకి రానివాళ్లకు జీతాలు ఎందుకని సీఎం వైసీపీ సభ్యుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చేది సభకు వచ్చినందుకు కాదని.. కేవలం అలవెన్సులకోసమేనని అన్నారు. సీఎం హోదాలో ఇప్పటివరకు చంద్రబాబునాయుడు దాదాపు ఆరువేలకోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేశారని..అలాంటి ఖర్చులో ఎమ్మెల్యేల జీతాలు ఎంతని ప్రశ్నించారు. అంతేకాదు ఇటీవల అమరావతి బాండ్ల విషయంలో కూడా సీఎం అనవసరంగా ఖర్చు చేశారని.. ఈ విషయంలో ముంబైలో గంట కొట్టడానికి వెళ్లి కోటిన్నర ఖర్చు చేశారు. మీరు మా జీతాల గురించి మాట్లాడతారా అంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీనుంచి తీసుకున్నారు. వారిపై తక్షణమే అనర్హత వేటు వేయండి. మేము సభలకు వస్తామని ఆళ్ల వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories