వైసీపీ నేత యలమంచిలి రవి అరెస్ట్!

వైసీపీ నేత యలమంచిలి రవి అరెస్ట్!
x
Highlights

విజయవాడలో అర్థరాత్రి బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత యలమంచిలి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని...

విజయవాడలో అర్థరాత్రి బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత యలమంచిలి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడానికి అధికారులు ప్రయత్నించగా... యలమంచిలి రవి అడ్డుకున్నారు. విగ్రహ కమిటీకి చెప్పకుండా ఎలా తొలగిస్తారంటూ...పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ పనుల కోసమే విగ్రహాన్ని తొలగిస్తున్నామని అధికారులు వివరించారు. అయినా యలమంచిలి రవి వినకుండా అక్కడే ఆందోళన చేపట్టారు. దీంతో యలమంచిలి రవిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత కాకాని విగ్రహాన్ని అధికారులు తొలగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories