కన్నా లక్ష్మీనారాయణతో వైసీపీనేత భేటీ.. బీజేపీలో చేరే అవకాశం..

కన్నా లక్ష్మీనారాయణతో వైసీపీనేత భేటీ.. బీజేపీలో చేరే అవకాశం..
x
Highlights

గతకొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కర్నూల్ జిల్లా వైసీపీనేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా...

గతకొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కర్నూల్ జిల్లా వైసీపీనేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా లద్దగిరిలో ఉంటున్న హరిచక్రపాణిరెడ్డితో బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. బీజేపీలోకి రావలసిందిగా ఆయన్ను కన్నా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోట్ల.. టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తిపై స్వల్ప తేడాతో ఓటమిచెందారు. ఆ తర్వాత వైసీపీకి, ప్రత్యేక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆరు నెలలక్రితమే దేవనకొండలో భారీ ఎత్తున కార్యకర్తల సమావేశం నిర్వహించారు. టీడీపీ చేరుతారని చర్చ సాగింది. తాజాగా ఆయనతో కన్నా లక్ష్మీనారాయణ భేటీ అవ్వడంతో హరిచక్రపాణి రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం ఊపందుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories