నేను వైసీపీకి రాజీనామా చేస్తా.. జగన్ పై పార్టీ కీలకనేత మండిపాటు..

నేను వైసీపీకి రాజీనామా చేస్తా.. జగన్ పై పార్టీ కీలకనేత మండిపాటు..
x
Highlights

పాదయాత్రతో సక్సెస్ ఫుల్ గా ముందుకెళుతున్న వైసీపీ అధినేత జగన్ కు కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. జగన్ తీసుకున్న సంచలన నిర్ణయంపై పార్టీలోని కొందరు కీలక...

పాదయాత్రతో సక్సెస్ ఫుల్ గా ముందుకెళుతున్న వైసీపీ అధినేత జగన్ కు కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. జగన్ తీసుకున్న సంచలన నిర్ణయంపై పార్టీలోని కొందరు కీలక నేతలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల కృష్ణా జిల్లాలోని దివంగత ఎన్టీఆర్ సొంత గ్రామమైన నిమ్మకూరులో జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాపేరును నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తానని ప్రకటన చేశారు. జగన్ చేసిన ఈ ప్రకటనపై మొదట్లో సానుకూల స్పందన వచ్చిన క్రమంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ మెంబెర్ దుట్టా రామచందర్ రావు అల్టిమేటం జారీ చేశారు. రెండు మూడు రోజులు వేచి చూస్తానన్న అయన ఏ నిర్ణయం వెలువడకపోతే పార్టీకి రాజీనామా చేసి కృష్ణా జిల్లా పరిరక్షణ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేస్తానని అన్నారు. శతాబ్దాలుగా కృష్ణా జిల్లాకు ఓ ప్రత్యేక ఉందని కృష్ణా నది ప్రవహిస్తున్న ఈ ప్రాంతంలో వ్యక్తుల పేర్లకు తావు లేదని స్పష్టం చేశారు. దీంతో దుట్టా నిర్ణయంతో అయోమయంలో పడింది వైసీపీ జిల్లా అధిష్టానం. ఇంకా ఇటువంటి అసంతృప్తి నేతల్ని పిలిపించుకుని మాట్లాడాలని జిల్లా అగ్రనేతలైన వెళ్లపల్లి శ్రీనివాస్ , పార్ధసారధి, కొడాలి నానిలకు జగన్ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories