వైసీపీకి రాజీనామా.. త్వరలో టీడీపీలో చేరిక..

వైసీపీకి రాజీనామా.. త్వరలో టీడీపీలో చేరిక..
x
Highlights

ఎన్నికలు మరో ఆరేడు నెలల్లో జరుగుతాయనగా ఏపీలో వైసీపీకి షాక్ తగిలింది, ఆ పార్టీనేత నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి...

ఎన్నికలు మరో ఆరేడు నెలల్లో జరుగుతాయనగా ఏపీలో వైసీపీకి షాక్ తగిలింది, ఆ పార్టీనేత నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గత నెలలో వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటివరకు వెంకటగిరి వైసీపీ ఇన్‌చార్జిగా పనిచేసిన తనకు మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించి, కొత్తగా పార్టీలోకి చేరిన ఆనం రామనారాయణరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దాంతో బొమ్మిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయగా.. అయన మొన్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిశారు. పార్టీలో చేరిక విషయమై చంద్రబాబుతో సంప్రదింపులు జరిపారు. తనను పార్టీలో చేర్చుకోవలసిందిగా సీఎంను కోరారు. చంద్రబాబు కూడా బొమ్మిరెడ్డి చేరికకు ఒకే చెప్పారు. దాంతో అయన టీడీపీలో చేరడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 15 లోపు బొమ్మిరెడ్డి టీడీపీలో చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories