సీఎం చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై.. వైసీపీ విమర్శలు..!

సీఎం చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై.. వైసీపీ విమర్శలు..!
x
Highlights

ఏటా తమ ఆస్తుల జాబితా ప్రకటించినట్టుగానే ఈ సంవత్సరానికి గాను తమ కుటుంభం ఆస్తులు ప్రకటించేసేసారు నారా ఫామిలీ.. తమ ఆస్తులు, అప్పులు మొత్తం ఇవేనంటూ ఇవాళ...

ఏటా తమ ఆస్తుల జాబితా ప్రకటించినట్టుగానే ఈ సంవత్సరానికి గాను తమ కుటుంభం ఆస్తులు ప్రకటించేసేసారు నారా ఫామిలీ.. తమ ఆస్తులు, అప్పులు మొత్తం ఇవేనంటూ ఇవాళ మంత్రి నారా లోకేష్ ఒక జాబితాను ఇచ్చారు.. దీనిపై ప్రతిపక్ష వైసీపీ మండిపడుతుంది.. సరైన ఆస్తులు ప్రకటించకుండా డమ్మీ వివరాలు ఎంత తక్కువ ఇస్తే ఏమి ప్రయోజనం, అసలు వీరి ఆస్తుల గురించి ఎవరడిగారు.. రాష్ట్రంలో ఎవరి ఆస్థి ఎంతో ప్రజలకు బాగా తెలుసునని విమర్శలు చేస్తుంది.. కాగా వైసీపీకి మద్దతుగా ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం తీవ్ర స్థాయిలో చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ పై విరుచుకు పడుతుంది.. రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులకు కారణం టీడీపీ ప్రభుత్వం.. వీటిని దారి మళ్లించడానికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆస్తుల రాజకీయం మొదలు పెట్టారని విమర్శలు చేస్తుంది వైసీపీ..

ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేతులెత్తేశారని, కమిషన్ ల విషయం లో చంద్రబాబు , మంత్రి దేవినేని ఉమలిద్దరు పోటీ పడుతున్నారని విమర్శిస్తున్నారు.. ఈ విషయంలో జనసేన అధినేత చేస్తున్న పని కూడా అలానే వుంది టీడీపీకి నష్టం జరుగుతందని తెలిసి పార్టీని కాపాడటానికి జనంలోకి వస్తారు తప్ప నిజంగా ప్రజలపై ప్రేమతో కాదని పవన్ పై విమర్శలు ఎక్కుపెడుతుంది.. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబుకు నమ్మినబంటు అని ఆరోపిస్తుంది వైసీపీ.. ఇదిలావుంటే కాపుల విషయంలో కూడా ప్రభుత్వం మరోసారి మోసం చేసింది గత ఎన్నికల సమయంలో టీడీపీ కాపులను బీసీలలో చేరుస్తామని హామీ ఇచ్చిన మాట అందరికి తెలిసిందే, తాజాగా ఆ హామీని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకున్నారు, కేంద్రం మాత్రం ఎన్ని రాష్ట్రాలకని న్యాయం చేస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు పక్కాగా కాపులను మోసం చేసారు.. అంతేకాదు ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన 600 వందల హామీలను దగ్గరుండి నెరవేర్చే బాధ్యత తనదేనని అప్పట్లో పవన్ అన్నారు.. ఇప్పుడు ఆ హామీలపై మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది..

Show Full Article
Print Article
Next Story
More Stories