కన్నడ హీరో తో కొట్లాడనున్న చరణ్, ఎన్టీఆర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ ఆర్ ఆర్'...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఎలాంటి వార్తయినా సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది. కన్నడ హీరో యశ్ 'కే జి ఎఫ్' సినిమాతో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యశ్ ను 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో విలన్ గా తీసుకోవాలని రాజమౌళి యోచిస్తున్నారట.
ఇప్పటికే టైగర్ ప్రభాకర్, దేవరాజ్, సుదీప్ వంటి కన్నడ యాక్టర్ లు తెలుగులో విలన్లుగా పరిచయమయ్యారు. పైగా కన్నడ రాకింగ్ స్టార్ గా మంచి పేరుంది, కాబట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో యశ్ నటిస్తే, ఈ సినిమాకు కన్నడలో సైతం క్రేజ్ పెరుగుతుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే రాజమౌళి లాంటి పెద్ద దర్శకుడి ద్వారా తెలుగులో పరిచయం అవ్వడం కెరీర్ కి ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి అతను కూడా పెద్ద అభ్యంతరాలు చెప్పకపోవచ్చు. అన్నీ కుదిరితే 'కే జి ఎఫ్' స్టార్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో ఫైట్ చేయనున్నాడన్నమాట.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT