యువకుడిని వాట్సాప్ లో నమ్మించి నగదు కొట్టేసిన యువతి!

యువకుడిని వాట్సాప్ లో నమ్మించి నగదు కొట్టేసిన యువతి!
x
Highlights

వాట్సాప్ ఆధారంగా ఓ యువతి యువకుడిని నమ్మించి డబ్బులు కాజేసింది. దీంతో ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు...

వాట్సాప్ ఆధారంగా ఓ యువతి యువకుడిని నమ్మించి డబ్బులు కాజేసింది. దీంతో ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన అమిత్‌వర్మ అనే యువకుడికి కొద్దిరోజుల క్రితం ఓ యువతి వాట్సాప్ కాల్ చేసింది. తాను ఉస్మానియా వర్సిటీ పరిశోధక విద్యార్థిగా ట్రైనింగ్ చేస్తున్నాని.. మీ స్నేహితుల ద్వారా నీ ఫోన్ నెంబర్ తీసుకున్నానని అతనికి చెప్పి. తనకు రూ. 100 రూపాయలు రీఛార్జ్ చెయ్యాలని బ్యాంక్ వివరాలు తీసుకుంది. ఆ తరువాత అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.1.18 లక్షల నగదు తగ్గింది. దీంతో సదరు యువతికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్అని వస్తోంది. ఇక చేసేదేమి లేక బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories