ప్రధాని భార్యకు భద్రత తొలగించండి

ప్రధాని భార్యకు భద్రత తొలగించండి
x
Highlights

ప్రధాని మోదీ భార్యకు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించాలని, లేకపోతే ఆమెను మోదీ భార్యగా అంగీకరించాలని డిమాండ్ చేస్తూ అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు...

ప్రధాని మోదీ భార్యకు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించాలని, లేకపోతే ఆమెను మోదీ భార్యగా అంగీకరించాలని డిమాండ్ చేస్తూ అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు డాక్టర్ పాలెపు సుశీల ఆరు రోజులుగా నిరాహారదీక్షను చేపట్టారు. హైదరాబాద్ మియాపూర్ లోని న్యూ హఫీజ్ పేటలో ఆమె క్లినిక్ నడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, జశోదబెన్ తో తన వివాహం చెల్లదని మోదీ చెబుతున్నారని... ఈ నేపథ్యంలో, ఆమెకు జెడ్ కేటగిరీ భద్రతను ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.

ఈ విషయమై మోదీ స్పందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. కాగా తనకు ఏ హోదాతో భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నారో తెలపాలంటూ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. భద్రతతో పాటు ప్రధాని భార్యకు ప్రోటోకాల్ ప్రకారం ఇంకా ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. తాను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా, తన భద్రతా సిబ్బంది అధికార వాహనాలు వాడుతుండటం విచిత్రంగా ఉందని వాపోయారు. అలాగే గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ తన పాస్‌పోర్ట్‌లో భార్యకు సంబంధించి ఎటువంటి వివరాలు పొందుపరిచారో తెలపాలంటూ జశోదా బెన్‌ ఆర్టీఐ అధికారులను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories