లారీ బీభత్సం.. ఒకరు మృతి..

లారీ బీభత్సం.. ఒకరు మృతి..
x
Highlights

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండుప్రాణం బలైపోయింది. తూర్పు గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీ బీభత్సం...

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండుప్రాణం బలైపోయింది. తూర్పు గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీ బీభత్సం సృష్టించింది. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ లారీ నడపుతున్నాడు. ఈ క్రమంలో పొలానికి వెళుతున్న మహిళను ఢీకొట్టింది. ఆ వెంటనే బైక్ పై వెళుతున్న మరో ఇద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సత్యనారాయణ, బలరామకృష్ణ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories