Top
logo

దారుణం..పార్శిల్‌లో మహిళ శవం

దారుణం..పార్శిల్‌లో మహిళ శవం
X
Highlights

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది.. మహిళ మృతదేశాన్ని పార్సిల్ చేసి రైల్వేట్రాక్ పక్కన పడేశారు. ఈ...

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది.. మహిళ మృతదేశాన్ని పార్సిల్ చేసి రైల్వేట్రాక్ పక్కన పడేశారు. ఈ దారుణం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పాతబస్తీ ప్రాంతమైన డబీర్ పుర లోని రైల్వే ట్రాక్ పై ప్రయాణికులకు ఓ పార్శిల్ కంటపడింది. దీంతో పోలీసులకు సమాచారమందించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఎక్కడో మహిళను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పార్శిల్ చేసినట్టు గుర్తించారు..కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మహిళను రెండు రోజుల క్రితం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story