ఐదునెలల పిండాన్ని సంచిలో వేసుకొచ్చిన యువతి..

ఐదునెలల పిండాన్ని సంచిలో వేసుకొచ్చిన యువతి..
x
Highlights

బలవంతంగా ప్రియుడు అబార్షన్ చేయించాడంటూ ఓ యువతి పిండాన్ని సంచిలో వేసుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తర...

బలవంతంగా ప్రియుడు అబార్షన్ చేయించాడంటూ ఓ యువతి పిండాన్ని సంచిలో వేసుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తర ప్రదేశ్‌ అమ్రోహ ప్రాంతానికి చెందిన యువతి స్థానిక యువకుడు ఇద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. అయితే పిల్లలు పుట్టడం తనకు ఇష్టం లేదన్న ఆమె ప్రియుడు బలవంతంగా ఆమెకు అబార్షన్ చేయించి ఐదు నెలల పిండాన్ని బయటకు తీయించాడు. దీంతో ప్రియుడితో గొడవకు దిగింది యువతి. అదే అదునుగా భావించిన ప్రియుడు సదరు యువతిని ఇంటినుండి బయటికి గెంటేసాడు. ఇక చేసేదేం లేక ఆమె ఐదునెలల పిండాన్ని సంచిలో వేసుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories