ఆడపిల్ల పుట్టిందని..తలాక్..

x
Highlights

కడుపులో ఉన్న బిడ్డ మగపిల్లాడే కావాలనుకున్న ఓ భర్త తన కోరిక నెరవేరకపోవడంతో భార్యకు విడాకులు ఇచ్చిన ఘటన హైదరాబాద్ టోలీ చౌక్‌లో చోటుచేసుకుంది. ...

కడుపులో ఉన్న బిడ్డ మగపిల్లాడే కావాలనుకున్న ఓ భర్త తన కోరిక నెరవేరకపోవడంతో భార్యకు విడాకులు ఇచ్చిన ఘటన హైదరాబాద్ టోలీ చౌక్‌లో చోటుచేసుకుంది. స్ధానికంగా నివాసముంటున్న ముజమ్మిల్‌ ప్రైవేటు స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది జనవరిలో ఇక్కడే ఉంటున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల క్రితం భార్య ఆడశిశువుకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ముజమ్మిల్‌ వేధించడం ప్రారంభించాడు. పుట్టింట్లో భార్యకు గత నెల 28న ఫోన్ చేసి ‘తలాక్‌’ అంటూ మూడు సార్లు చెప్పాడు. దీంతో ఆవేదనకు గురైన బాధితురాలు తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచార ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories