బీజేపీ ప్రశ్నకు టీడీపీ బదులేదీ?

బీజేపీ ప్రశ్నకు టీడీపీ బదులేదీ?
x
Highlights

కరెక్టే. ఏపీకి కేంద్రం అన్యాయం చేసింది. హోదా విషయంలో ఏమీ చేయలేకపోయింది. నిధులు కూడా కావాల్సినంత సమకూర్చలేకపోయింది. అదే సమయంలో.. కేంద్రం మాత్రం నిధులు...

కరెక్టే. ఏపీకి కేంద్రం అన్యాయం చేసింది. హోదా విషయంలో ఏమీ చేయలేకపోయింది. నిధులు కూడా కావాల్సినంత సమకూర్చలేకపోయింది. అదే సమయంలో.. కేంద్రం మాత్రం నిధులు ఇస్తున్నామని.. ఏపీని కూడా బాగానే చూసుకుంటున్నామని బదులు చెబుతోంది. ఇందులో నిజాలు, అబద్ధాల సంగతి జనం నిర్ణయానికి వదిలేస్తే.. ఇక్కడ బీజేపీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు.

పోలవరం ప్రాజెక్టులో అవినీతి, పట్టిసీమలో చేసిన అవినీతిపై.. బీజేపీ నేతలు చంద్రబాబును నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేవని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. దీక్షలు చేసుకునేందుకు మాత్రం ఎక్కడి నుంచి డబ్బులను సమకూర్చుకుంటోందని కమలనాథులు ప్రశ్నించారు. వింటుంటే.. లాజిక్ కరెక్టే అనిపిస్తోంది. మరి.. అంత భారీ మొత్తం ఖర్చు పెట్టడం ఎందుకు? ఎందుకు అంతంత సభలు నిర్వహించడం అన్న ప్రశ్న కూడా కొందరి నుంచి వినిపిస్తోంది.

బీజేపీ వేసిన ఈ ప్రశ్నకు టీడీపీ నుంచి జవాబు కూడా వచ్చేందుకు అవకాశం లేదని.. కొందరు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. 5 కోట్లు పెట్టి ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు చేసిన ప్రయత్నంతో పాటు.. మంత్రి లోకేష్ కు తెలుగు నేర్పించేందుకు లక్షలకు లక్షలు కుమ్మరించిన తీరు చూస్తుంటే.. ఏపీ ప్రభుత్వానికి ప్రజాధనం అంటే ఎంత నిర్లక్ష్యమో తెలిసిపోతోందని కొందరు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు.

అలాంటపుడు.. తిరుపతి సభకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగడం.. బీజేపీ నేతల అమాయకత్వమని ఇంకొందరు చెబుతున్నారు. ఆలోచిస్తుంటే.. ఈ లాజిక్ కూడా కరెక్టే అనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories