సీరియల్ చూసి..ఆపై భ‌ర్త‌ను హ‌త్య చేసి : స్వాతి

సీరియల్ చూసి..ఆపై భ‌ర్త‌ను హ‌త్య చేసి : స్వాతి
x
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన నాగుర్ క‌ర్నూల్ కు చెందిన సుధాక‌ర్ రెడ్డి హ‌త్య‌కేసులో ప‌లు విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. నాగ‌ర్...

రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన నాగుర్ క‌ర్నూల్ కు చెందిన సుధాక‌ర్ రెడ్డి హ‌త్య‌కేసులో ప‌లు విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. నాగ‌ర్ క‌ర్నూల్ కు చెందిన స్వాతి - రాజేష్ ల అక్ర‌మ‌సంబంధం పై గత నెల 26న భ‌ర్త సుధాక‌ర్ రెడ్డి నిల‌దీయ‌గా ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాద‌మే జ‌రిగింది. దీంతో ఆవేశానికి లోనైన స్వాతి భ‌ర్త సుధాక‌ర్ రెడ్డిని హ‌త్య చేయ‌డానికి ప‌థ‌కం వేసింది. అనుకున్న‌ట్లుగా భ‌ర్త‌ను ఎలా హ‌త్య చేయాలి. ఏ విధంగా హ‌త్య చేయాలి అనే విష‌యాల్నీ ‘మనసు మమత’టీవీ సీరియల్ ద్వారా తెలుసుకుంది. అయితే అదే రోజు సాయంత్రం టీవీ సీరియ‌ల్ చూపించిన‌ట్లు..నిద్రిస్తున్న భ‌ర్త‌ను హ‌త్య చేసేందుకు ప్రియుడు రాజేష్ ను ఇంటికి పిలిపించుకుంది. నిద్ర‌లో ఉన్న సుధాక‌ర్ రెడ్డి స్పృహ‌లోకి రాకుండా మెడ‌కు మ‌త్తుమందు ఇచ్చింది. ఆపై కేక‌లు వేయ‌కుండా నోట్లోగుడ్డ కుక్కి ఇనుప‌రాడ్ తో దాడి చేసింది. దీంతో సుధాక‌ర్ రెడ్డి అక్క‌డిక్క‌డే క‌న్నుమూశాడు.
అనంత‌రం సుధాక‌ర్ రెడ్డి శవాన్ని దుప్పట్లో మూటగట్టి నవాబ్‌పేట మండలం ఫతేపూర్‌ మైసమ్మ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. రోడ్డుకు వంద మీటర్ల దూరం అడవిలో శవాన్ని పడేసి.. వెంట తీసుకెళ్లిన పెట్రోల్‌తో తగులబెట్టారు.
ఈ భ‌యాన‌క సంఘ‌ట‌న త‌రువాత ప్రియుడు రాజేష్ ను భ‌ర్త‌గా న‌మ్మించే ప్ర‌య‌త్నంలో యాసిడ్ ప్లాన్ వేసిన స్వాతి వ్య‌వ‌హారం అనుమానం రావ‌డంతో పోలీసులు రంగంలో త‌నదైన స్టైల్లో విచారించ‌గా జ‌రిగిన దారుణాన్ని భ‌య‌ట‌పెట్టిన‌ట్లు నాగర్‌కర్నూల్‌ ఏఎస్పీ జోగుల చెన్నయ్య చెప్పారు.ఈ కేసులో ఏ1 నిందితుడిగా రాజేశ్, ఏ2 నిందితురాలిగా స్వాతిని చేర్చినట్లు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories