ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిందో ఇల్లాలు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సమీపంలోని...
ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిందో ఇల్లాలు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సమీపంలోని ఐ.పోలవరంలో జరిగింది. రాజమహేంద్రవరం హుకుంపేటకు చెందిన వడ్డి ఇమ్మానియేల్, దేవి దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. ఇమ్మానియేల్ భవన నిర్మాణ పనులకు వెళుతుండేవాడు. అతనితో పాటు శివ అనే యువకుడు కూడా ఆ పనికి వస్తుండేవాడు. ఈ క్రమంలో శివ అప్పుడప్పుడు ఇమ్మానియేల్ ఇంటికి వస్తుండేవాడు. దాంతో దేవి పరిచయమై వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఈ విషయం ఇమ్మానియేల్ కు మందలించాడు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళింది. అయితే కుటుంబసభ్యులు భార్యభర్తలకు నచ్చజెప్పి భర్త ఇంటికి పంపించారు. అయితే దేవి పిల్లల్ని స్కూల్ కు తీసుకువచ్చే క్రమంలో మళ్ళీ శివతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ విషయం ఇమ్మానియేల్ తన స్నేహితుల ద్వారా తెలుసుకుని భార్యపై గొడవకు దిగాడు. ఆ తరువాత భర్తపై కోపాన్ని పెంచుకున్న దేవి విషయాన్నీ ప్రియుడు శివకు తెలియజేసింది. అతను మర్డర్ ప్లాన్ చెప్పాడు. జూలై 26న రాజమహేంద్రవరం మార్కెట్ సెంటర్‌కు రావాలని ఇమ్మానియేల్‌ను శివ కోరాడు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి గోకవరం మీదుగా రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొనుగోలు చేసిన మద్యాన్ని తాగారు. తరువాత భార్య దేవి కూడా ఆ చోటుకు వచ్చింది. 'నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్' అంటూ ఇమ్మానియేల్ భార్యను ప్రశ్నించాడు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటికే ఇమ్మానియేల్ మద్యం మత్తులో ఉన్నాడు. దేవి, శివలు కలిసి ఇమ్మానియేల్ గొంతు నొక్కి చున్నీతో గట్టిగా చుట్టడంతో మృతి చెందాడు. ఆ తరువాత పెట్రలో పోసి తగలబెట్టారు. భర్తను ఎవరో హత్య చేసారంటూ కుటుంబసభ్యులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్య ఘటనాస్థలిలో వదిలివెళ్లిన సెల్ ఫోన్ ఆధారంగా నిందితులు భార్య దేవి ఆమె ప్రియుడు శివ గా పోలీసులు గుర్తించారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMT