Top
logo

టి- కాంగ్రెస్ లో ఈ మౌన పోరాటానికి కారణాలేంటి?

X
Highlights

ఒకప్పుడు అపరిమితమైన స్వేచ్ఛ కార్యకర్త నుంచి సీనియర్ వరకూ అందరూ సిఏం పోటీకి అర్హులే ప్రత్యర్ధులపై పంచ్ లేయడం...

ఒకప్పుడు అపరిమితమైన స్వేచ్ఛ కార్యకర్త నుంచి సీనియర్ వరకూ అందరూ సిఏం పోటీకి అర్హులే ప్రత్యర్ధులపై పంచ్ లేయడం మాని సొంత పార్టీ నేతలే పంచ్ లేసుకునేవారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతల ధోరణి మారింది బుద్ధిగా తమ పని తాము చూసుకుంటున్నారు పార్టీ నేతల్లో ఈ హటాత్ మార్పుకు కారణమేంటి? ఈమౌనం వెనక ఏముంది?

తెలంగాణ కాంగ్రెస్ లో ఓ వింత పరిస్థితి కనిపిస్తోంది గతంలో ఏ ఇద్దరు కలసినా పిచ్చాపాటీగా సవాలక్ష రాజకీయాలు మాట్లాడుకునేవారు ఇద్దరూ మిత్రులైతే కలసి ప్రతిపక్షాన్ని ఏకి పారేసేవారు కానీ ఇద్దరికీ గొడవలుంటే పోటా పోటీ ప్రెస్ మీట్లు పెట్టి బాహాటంగానే తిట్టుకునే వారు. నోటికి ఎంతొస్తే అంత ఎలా పడితే అలా ఒకరినొకరు హద్దులు మీరి విమర్శించుకున్న రోజులున్నాయి. పోటా పోటీ సవాళ్లు విసురుకున్న ఉదంతాలున్నాయి ఇక సీఎం పదవికీ నేతలందరూ పోటీ పడటం ఆనవాయితీ కాస్త సీనియర్ అయిన ప్రతీ ఒక్కరూ సిఎం పదవికి అర్హులుగానే భావిస్తారు నాయకత్వ లక్షణాలకు తోడు, సీనియారిటీకి కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఎక్కువ అందుకే వృద్ధతరం నేతలు కూడా యాక్టివ్ గా కొనసాగే పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో స్థానిక నేతలు ఏం మాట్లాడినా, ఏం విమర్శించినా అది అధిష్టానం దాకా చేరే అవకాశం లేదు ఒక వేళ చేరినా రెండు వర్గాల వివరణలను తీసుకుని సర్ది చెప్పి మధ్యవర్తిత్వం నెరిపే నేతలు ఢిల్లీలో ఉండనే ఉంటారు. అందుకే కిందిస్థాయి కార్యకర్త నుంచి సీనియర్ నేతల వరకూ అందరిదీ అదే దారి. నిన్న మొన్నటి వరకు నేనంటే సియం నేనే అంటూ బహింరంగానే వ్యాఖ్యలు చేసుకున్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ నుండి ఇటీవల పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వరకు తనకు సియం అయ్యే అర్హత ఉందంటూ సవాలు విసురుకున్నారు.

కానీ ఇప్పుడు అందరూ మౌనం వహిస్తున్నారు. అంతా పరిమితంగా మాత్రమే స్పందిస్తున్నారు ఇందుకు కారణం లేకపోలేదు ఇన్నాళ్లూ పార్టీ ఏఐసిసి ఇంచార్జ్ కుంతియా మాత్రమే పార్టీ వ్యవహారాలు చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎలాగైనా ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలలో ఉన్న రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు గెలుపుకు అవరోధాలుగా భావిస్తున్న పరిస్థితులను కంట్రోల్ చేస్తున్నారు పార్టీ నేతలు అనవసరవ్యాఖ్యలకు ముందు అడ్డుకట్ట వేశారు. దీనికోసం మరో అయిదుగురు ఎఐసిసి కార్యదర్శులను రంగంలోకి దించారు. దీంతో పార్టీలో సీన్ మారిపోయింది. ఈ కార్యదర్శులంతా పార్లమెంటు నియోజక వర్గాల వారీగా పర్యటనలు చేసి నేరుగా రాహుల్ గాంధీకి రిపోర్ట్ చేస్తున్నారు దాంతో నేతలు ఎవరికి వారు తాము సిఎం పదవికి అర్హులమని చెప్పుకునే వీలు లేదు నేతలపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు రాహుల్ కి అందుతుండటంతో ఇక్కడ నేతల నోళ్లు బంద్ అయ్యాయి. రాహుల్ చేసిన ఈ ఏర్పాటు వల్ల నేతలంతా కాలక్షేపం రాజకీయాలు మాని సీరియస్ గా నియోజక వర్గంపై దృష్టి పెడుతున్నారు. సమస్య ఏదైనా ఉంటే గాంధీ భవన్ లో ఉండే ఏఐసిసి ఇంచార్జులకు చెప్పి వెళ్లడం మినహా ఎలాంటి కామెంట్లు, ఆందోళనలు ఆరోపణలు చేయడం లేదు.

ఇక ఇటీవల మాజి కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఉత్తమ్ కాబోయే సియం అంటూ చేసిన వాఖ్యలు గతంలో చేసిఉంటే పార్టీలో ఎంతో దుమారం రేగేది. కానీ సీనియర్లంతా సంయమనం పాటించి, సియం పదవి అధిష్టానం నిర్ణయింస్తుందనీ, పార్టీని అధికారంలోకి తేవాలని, అందుకు కష్టపడాలని సీనియర్లు పదే పదే చెబుతున్నారు మినిట్ టుమినిట్ ఏఐసిసి కార్యదర్శులు అధినేతకు రిపోర్టు ఇస్తున్నారనే సమచారంతోనే నేతలంతా గప్ చుప్ అయిపోయారన్నది పార్టీలో చర్చ. నిన్న మొన్నటి వరకు గాంధీ భవన్లో ఏ జిల్లా మీటింగ్ నడిచినా రణరంగంగా మారేది. కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. మరి ఈ క్రమశిక్షణ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

Next Story