logo
సినిమా

బోనీకపూర్‌‌ను శ్రీదేవి ఎందుకు వివాహం చేసుకుందంటే...

బోనీకపూర్‌‌ను శ్రీదేవి ఎందుకు వివాహం చేసుకుందంటే...
X
Highlights

శ్రీదేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో తిరుగులేని హీరోయిన్‌గా అగ్రస్థానం నిలబెట్టుకుంది. అయితే ఆమె...

శ్రీదేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో తిరుగులేని హీరోయిన్‌గా అగ్రస్థానం నిలబెట్టుకుంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం అంతసాఫీగా సాగలేదనే చెబుతుంటారు. సినీ అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో ఆమె నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుంది. దీనిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోనీ కపూర్‌ను శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై బోనీకపూర్ మొదటి భార్య మోనా కపూర్ అప్పట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాహానికి ముందే బోనీ కపూర్‌కు శ్రీదేవితో వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. బోనీకపూర్ కారణంగా శ్రీదేవి గర్భవతి అయ్యారని, అందుకే బోనీకపూర్... శ్రీదేవిని వివాహం చేసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బోనీ‌కపూర్‌ను పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది.

Next Story