అజ్ఞాతంలో ప‌వ‌న్ క‌ల్యాణ్

అజ్ఞాతంలో ప‌వ‌న్ క‌ల్యాణ్
x
Highlights

అజ్ఞాతవాసి పవన్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? కేంద్ర బడ్జెట్ పై అన్ని పార్టీలు మండిపడుతుంటే పవర్ స్టార్ ఎక్కడ? బడ్జెట్ వచ్చి రెండు రోజులు...

అజ్ఞాతవాసి పవన్ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? కేంద్ర బడ్జెట్ పై అన్ని పార్టీలు మండిపడుతుంటే పవర్ స్టార్ ఎక్కడ? బడ్జెట్ వచ్చి రెండు రోజులు గడిచిపోయినా.. పవన్ స్పందన మాత్రం కరువైంది.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్న జనసేన ఎన్నికల ముంగిట్లో ఇంత నిర్లిప్తంగా ఉండటానికి కారణాలేంటి?

ప్రశ్నిస్తా అంటూ బయల్దేరిన జన సేనాని బడ్జెట్ పై కనీసం మాట మాత్రంగానైనా స్పందించకపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఉభయ రాష్ట్రాల్లో చలొరే చలొరే చల్ అంటూ యాత్ర జరిపిన పవన్ ఆ తర్వాత మళ్లీ కనపడకుండా పోయారు..యూనియన్ బడ్జెట్ లో ఈసారి ఏపీకి కేంద్రం మొండి చేయిచూపించినా.. ప్రశ్నిస్తానన్న పవన్ లో ఆవేశం కనపడటం లేదేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం బడ్జెట్ లో చేసిన అన్యాయంపై అధికార టీడీపీతో సహా, వైసీపీ, కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున మండిపడుతుంటే.. జనసేన కనీసం ఒక స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేకపోయింది.

గతంలో మోడీని గెలిపించాలంటూ జిల్లా జిల్లా తిరిగిన పవన్ ఈ మధ్య కాలంలో బీజేపీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. కేంద్రాన్ని ప్రశ్నించి తీరతానంటూ బహిరంగ సభల్లో ఆవేశంగా ప్రకటించి ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు.. బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ లేదు.. విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేదు.. పోలవరం పైనా కనీసం ప్రస్తావన లేదు.. నాలుగేళ్ల నుంచి బీజేపీ తీరు ఇలానే ఉన్నా.. ఇప్పుడు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ లోనైనా కనీసం ఎంతోకొంత విదులుస్తారని ఆశించిన జనానికి మొండి చెయ్యే మిగిలింది.. అన్ని రాజకీయ పార్టీలు కేంద్రం తీరును ఎండగుతుంటే.. పవన్ కనీసం బయటకు రాలేదు.. కనీసం ట్వీట్ కూడా చేయలేదు.. ఇంత కీలక విషయంపై ఇంత మౌనంగా ఉండటం పవన్ భవిష్యత్తుకే మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

మొన్నటి చలొరే చలోరే కార్యక్రమంలో ఇకపై జనంలోనే ఉంటానని పవన్ భీషణ ప్రతిజ్ఞ చేశారు.. ఆ నాలుగు రోజులు వైసీపీని ఎండగట్టడం.. మినహా పవన్ మరేం చేయలేదన్న విమర్శలున్నాయి. కనీసం బడ్జెట్ పైనా తమ నేత స్పందించకపోవడంపై జనసేన కార్యకర్తల్లోనే నిరుత్సాహం పెల్లుబుకుతోది. గతంలో ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వరకూ వెలతాం అని పవన్ అన్నారు.. కానీ ఇప్పుడు కళ్ల ముందే ఇంత అన్యాయం జరుగుతున్నా పవన్ స్పందన మాత్రం కరువైంది.. పవన్ సైలెన్స్ వెనక ఏదైనా వ్యూహముందా? లేక బడ్జెట్ ను ఆయన ఇంకా అర్ధం చేసుకుంటున్నారా?

Show Full Article
Print Article
Next Story
More Stories