ఇన్‌స్టా గ్రామ్ ఆర్జనలో విరాట్ కొహ్లీ రికార్డు

Highlights

టీమిండియా కెప్టెన్, టీ-20 క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ రికార్డుల మోత...

టీమిండియా కెప్టెన్, టీ-20 క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా, బ్యాట్స్ మన్ గా దూసుకుపోతున్న విరాట్ కొహ్లీ తన బ్రాండ్ వాల్యూని సైతం అనూహ్యంగా పెంచుకొని రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. అంతటితోనే ఆగిపోకుండా సోషల్ మీడియా ద్వారాను తన పాపులారిటీని కోట్లరూపాయలుగా మలచుకొంటున్నాడు. కొహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఓ ప్రమోషనల్ పోస్ట్ ను ఉంచినందుకు 3 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ప్రపంచ సాకర్ అత్యంత ఖరీదైన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోతో సమానంగా ఇన్ స్టాగ్రామ్ ప్రమోషనల్ ఆదాయం సంపాదిస్తున్నాడు. 29 ఏళ్ల విరాట్ కొహ్లీకి ఫేస్ బుక్ ద్వారా 3 కోట్ల 60 లక్షల లైక్ లు వస్తున్నాయి. ట్విట్టర్ లో కొహ్లీని 2 కోట్లమంది, ఇన్ స్టాగ్రామ్ ద్వారా కోటీ 20 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఫోర్బెస్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం అత్యధిక సంపాదన ఉన్న ప్రపంచ క్రీడాప్రముఖుల్లో విరాట్ కొహ్లీ ఏడవస్థానంలో నిలిచాడు, అర్జెంటీనా సాకర్ గ్రేట్ లయనల్ మెస్సీ కంటే కొహ్లీనే సంపాదనలో ముందుండటం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories