రఘువీరా... లేవరా... దీక్షబూని సాగరా!!

రఘువీరా... లేవరా... దీక్షబూని సాగరా!!
x
Highlights

కాంగ్రెస్ హైకమాండ్ అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. ఏపీ కాంగ్రెస్ మాత్రం చేతులెత్తేస్తోంది. కర్నాటకలో అధికారాన్ని హస్తం పార్టీ...

కాంగ్రెస్ హైకమాండ్ అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. ఏపీ కాంగ్రెస్ మాత్రం చేతులెత్తేస్తోంది. కర్నాటకలో అధికారాన్ని హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. ఆ ప్రయోజనాన్ని చెప్పుకునే పరిస్థితిలో కూడా ఏపి కాంగ్రేస్ లేదు. తెలంగాణలోనూ అధికార పార్టీకి ధీటుగా కాంగ్రెస్ ముందుకెళ్తుంటే.. ఏపీ మాత్రం ఇంకా నాలుగేళ్ల నాటి పరిస్థితే కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా.. ఏపీ పీసీసీ చీఫ్‌ స్పందించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా వరుస అపజయాలను ఎదుర్కోన్న కాంగ్రెస్.. దక్షిణాదిన తన పట్టుకోసం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కర్నాటకలో అధికారం వదులకోవద్దనే ఉద్దేశ్యంతో ప్రత్యర్ది పార్టీ అయినా.. జేడిఎస్ తో జతకట్టి బిజేపికి షాక్కించింది. పట్టుకోసం జాతీయ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. ఏపీ కాంగ్రెస్ మాత్రం చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో రాష్ట్రం విభజన కారణంగా కాంగ్రేస్ కు నిరాశ ఎదురయ్యింది. పార్టీ ముఖ్యనేతలంతా ఇతర పార్టీలకు వలస వెళ్లారు. నాలుగేళ్లుగా పార్టీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిపై పార్టీలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని ప్రజల్లో తీసుకెళ్లడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా శూన్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. జాతీయపార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహించడం తప్ప.. రాష్ట్ర పార్టీ సొంతంగా ఎలాంటి కార్యక్రమాలను రూపొందించడం లేదనే చర్చ పార్టీలో ఉంది. ఎన్నికలై.. నాలుగేళ్లు గుడుస్తున్నా, నేటికి పార్టీ పరిస్థితిలో ఎటాంటి మార్పు కనిపించడంలేదు. అధ్యక్షుడిగా రఘువీరాకు పార్టీని కాపాడాలనే లక్ష్యం ఉన్నట్లు కనిపించడం లేదనే భావన పార్టీలో ఉంది. పార్టీకి సమయం కేటాయించకుండా, మొక్కుబడిగా అధ్యక్ష భాద్యతలు నిర్వహిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. వారంలో నాలుగు రోజులు బెంగుళూరులో గడిపి.. ఒక్కరోజు హైదరాబాద్ లో ఉండి.. వీలైతే, ఏపిలో ఉంటున్నారనే ఆరోపణలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. దీనికి తోడు రఘువీరానే పార్టీలో కోవర్టు అనే ప్రచారం కూడ ఉంది. ఆయన సొంత పార్టీ ప్రయోజనం కన్నా.. వైసిపి ప్రయోజనాలే ముఖ్యమనే చర్చ కూడ హస్తం పార్టీలో జోరుగా సాగుతోంది.

ఇంకా పార్టీని నమ్ముకుకొని పలువురు ముఖ్యనేతలు ఉ్ననా.. రఘువీరా వారిని కలుపుకొని పోకపోవడం వల్లే, వాళ్లు పార్టీలో యాక్టివ్ గా ఉండలేకపోతున్నారనే వాదన ఉంది. కనీసం నెలకు ఒకసారి కూడా అధ్యక్షుడు పార్టీ మీటింగ్ ను నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అదే కాంగ్రేస్ పార్టీ, తెలంగాణలో ప్రజల్లో తిరుగుతూ.. అధికార పార్టీకి ముచ్చెముటలు పట్టిస్తోంది. ఏపిలో మాత్రం కాంగ్రేస్ ఉందా అనే అనుమానాలు కల్గే విదంగా వ్యవహరిస్తోంది. కార్ణటకలో తమ వల్లే, ప్రజలు బిజేపికి బుద్ది చెప్పారని.. టీడీపీ గొప్పలు చెప్పుకుంటుంటే.. కాంగ్రేస్ మాత్రం చెప్పుకోలేని దుస్థితిలో ఉంది. పార్టీ బలపడే గొప్ప అవకాశాలొచ్చిన పార్టీ అధ్యక్షుడు రఘువీరకు ఇష్టంలేదని భావనలో పార్టీ ఉంది. ఏపీ పీసీసీ అధ్యక్షుడికే, పార్టీ బలపడాలనే లక్ష‌్యం లేకపోతే.. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవడం క‌ష్టమనే భావన పార్టీలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories