logo

లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన

లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన
Highlights

ఉమ్మడి హైకోర్టు విభజన కోసం లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్ల దాటినా...

ఉమ్మడి హైకోర్టు విభజన కోసం లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్ల దాటినా హైకోర్టును కేంద్రం ఎందుకు విభజించడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీలు సభ ప్రారంభమైన వెంటనే ‘వియ్‌ వాంట్‌ హైకోర్ట్’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించగా ఆందోళన చేపట్టి అడ్డుకున్నారు. టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత జితేందర్‌రెడ్డి తన స్థానంలోనే లేచి నిలబడి ఆందోళన చేపట్టగా కవిత వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారు. గందరగోళం మధ్య లోక్‌సభ వాయిదా పడింది.


లైవ్ టీవి


Share it
Top