నీటి కొట్లాటలో మరోసారి ఏపీ విజయం

నీటి కొట్లాటలో మరోసారి ఏపీ విజయం
x
Highlights

విభజన దగ్గరి నుంచి నీటి పంపకాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య.. ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. నాగార్జున సాగర్ పై తెలంగాణ అధికారులు, శ్రీశైలంపై...

విభజన దగ్గరి నుంచి నీటి పంపకాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య.. ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. నాగార్జున సాగర్ పై తెలంగాణ అధికారులు, శ్రీశైలంపై ఆంధ్రప్రదేశ్ అధికారులు పట్టు పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా అప్పుడప్పుడు గొడవలకు దారి తీసిన సందర్భాలు ఉన్నాయి. చాలా వరకూ.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించగా.. ఇప్పుడు మరోసారి తన పంతాన్ని అదే రాష్ట్రం నెగ్గించుకుంది.

ఇప్పటికే ఒకటికి రెండు సార్లు నీటి విడుదలపై కృష్ణా బోర్డు ఏపీకి అనుకూలంగా ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పుడు మరోసారి అదే తరహా ఆదేశాలు ఇచ్చింది. మామూలుగా కేటాయించిన కోటా పూర్తి కావడంతో.. నీటి విడుదలను తెలంగాణ అధికారులు ఆపేశారు. దాంతో.. ఏపీ ఉన్నతాధికారులు వెళ్లి మరో రెండు రోజులు నీటిని విడుదల చేయాల్సిందే అని గొడవకు దిగారు. విషయం.. బోర్డు వరకూ వెళ్లింది.

మరో ఐదు రోజుల పాటు.. రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని వదలాలని బోర్డు ఆదేశించడంతో.. తెలంగాణ అధికారులు మరోసారి ఏపీకి నీటిని వదలడం మొదలు పెట్టారు. ఇలా.. నీటి గొడవల విషయంలో.. తెలంగాణపై ఏపీ మరోసారి పై చేయి సాధించినట్టయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories