Top
logo

అరటి పళ్ల కత్తితో గుండు గీయించిన పంతులు

X
Highlights

వరంగల్లో అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హన్మకొండ పట్టణ వీధి బాలల వసతిగృహంలో.. వాచ్ మెన్ జవహర్ తో పాటు.. ...

వరంగల్లో అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హన్మకొండ పట్టణ వీధి బాలల వసతిగృహంలో.. వాచ్ మెన్ జవహర్ తో పాటు.. మ్యాథ్స్ టీచర్ రాజు.. విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అకారణంగా కొట్టడమే కాకుండా.. రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. అరటి పళ్ల కత్తితో ముగ్గురు విద్యార్థులకు గుండు గీయించారు. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు విద్యార్థులను చావబాదుతున్నారు. దీంతో స్టూడెంట్స్ అంతా కలిసి.. రోడ్డుపై బైఠాయించారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ తమను ఏవిధంగా హింసించాడో.. విద్యార్థులు చేసి చూపించారు.

అయితే వాచ్ మెన్ జవహర్ మాత్రం విద్యార్థులు ఆరోపణలు అవాస్తవమని.. అన్నారు. వారిని తానెప్పుడూ కొట్టలేదని చెప్పాడు. అయితే జవహర్ చెప్పేదంతా అబద్దమని.. అతను చెప్పేది నమ్మొద్దంటూ.. పిల్లలు నినాదాలు చేశారు. అనాథ విద్యార్ధులపై అమానుష ఘటన విషయం తెలుసుకున్న అధికారులు.. రాజు, జవహర్ లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు.. తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story