Top
logo

అమెరికాలో తెలుగు యువకుడిపై ఘోరం..

అమెరికాలో తెలుగు యువకుడిపై ఘోరం..
X
Highlights

అమెరికాలోని కేన్సస్‌ నగరంలో ఘోరం జరిగింది. 26 ఏళ్ల శరత్‌ శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో మిత్రులతో డిన్నర్‌కు...

అమెరికాలోని కేన్సస్‌ నగరంలో ఘోరం జరిగింది. 26 ఏళ్ల శరత్‌ శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో మిత్రులతో డిన్నర్‌కు వచ్చాడు. ఇంతలో ఆగంతకుడు వచ్చి కాల్పులు మొదలెట్టాడు. మిగతా అందరూ నేలపై పడుకోగా కొప్పు శరత్‌ పారిపోయే ప్రయత్నం చేశారు. రెండు బుల్లెట్లు తగిలి కుప్పకూలి పోయాడు. దుండగుడు పేల్చింది మొత్తం ఐదు బుల్లెట్లు. దుండగుడు అక్కడి నుంచి వెళ్లాక మిత్రులు రక్తపు మడుగులో పడివున్న శరత్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శరత్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన శరత్ స్థానిక వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాడు. హైదరాబాద్ హైటెక్‌ సిటీలోని పెగాసిస్టం వరల్డ్‌ వైడ్‌ కంపెనీలో చేరాడు. జీతం కూడా బాగానే వస్తున్నా స్నేహితులంతా ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లడంతో తనుకూడా గత జనవరిలో ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్లాడు.

Next Story