ఏపీ బీజేపీ, టీడీపీలో చిచ్చుపెట్టిన గుజరాత్ ఎన్నికలు

ఏపీ బీజేపీ, టీడీపీలో చిచ్చుపెట్టిన గుజరాత్ ఎన్నికలు
x
Highlights

ఏపీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్‌ రిజల్ట్స్‌...రెండు పార్టీల మధ్య మంటలు రేపుతున్నాయి.మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ...

ఏపీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్‌ రిజల్ట్స్‌...రెండు పార్టీల మధ్య మంటలు రేపుతున్నాయి.మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ లీడర్లు... ఒకరిపై మరొకరు పంచ్‌ డైలాగ్‌ పేల్చుకుంటున్నారు. అయితే వివాదం మరింత ముదరకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
గుజరాత్‌ రిజల్ట్స్‌ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీలోనూ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతామన్న బీజేపీ నేతల మాటలు.... టీడీపీకి మంట పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేత సోము వీర్రాజు.... టీడీపీ లీడర్‌ బాబూరాజేంద్రప్రసాద్‌ కామెంట్స్‌ రెండు పార్టీల్లో హీట్‌ పుట్టించాయి. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్న సోము వీర్రాజు.... టీడీపీతో పొత్తు లేకుండా గెలిచే సత్తా బీజేపీకి ఉందన్నారు. పొత్తు పెట్టుకున్న ప్రతీసారీ బీజేపీని టీడీపీ మోసం చేస్తూనే వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేసి ఉంటే 50 సీట్లను గెలుచుకునేవారమన్నారు. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నా.... బీజేపీ కార్యకర్తలకు కనీసం ఇళ్లు, పెన్షన్లు ఇప్పించుకోలేని స్థితిలో ఉన్నామని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తంచేశారు.
అయితే టీడీపీ-బీజేపీ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు మంత్రి సోమిరెడ్డి. ఏపీ బీజేపీ నేతల మాటలను మోడీ, అమిత్‌షాలు నమ్ముతారనుకోవడం లేదన్నారు.గుజరాత్‌ రిజల్ట్స్‌ తర్వాత టీడీపీ, బీజేపీ
నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెక్‌ పెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. వివాదం మరింత ముదరంగా సంయమనం పాటించాలని టీడీపీ నేతలకు
ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories