ఆ విషయమై వైయస్ పై అసత్య ప్రచారం చేశారు : ఉండవల్లి

ఆ విషయమై వైయస్ పై అసత్య ప్రచారం చేశారు : ఉండవల్లి
x
Highlights

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ మరోసారి ఫైర్ అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై గతంలో ఓ అసత్య ప్రచారం జరిగిందని.. ఏడూ కొండలున్న తిరుమల.....

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ మరోసారి ఫైర్ అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై గతంలో ఓ అసత్య ప్రచారం జరిగిందని.. ఏడూ కొండలున్న తిరుమల.. రెండు కొండలేనని వైయస్ అన్నట్టు మిగతా ఐదు కొండల మధ్య చర్చిలు కడుతున్నట్టు ప్రాపగాండా సృస్టించారని.. అదంతా రాజకీయ నాయకుల కుట్ర అన్నారు. తన మీద పడ్డ నిందను తొలగించుకోవడానికి వైయస్ నాడు తిరుమల ఏడూకొండలని చెబుతూ జీవో కూడా ఇచ్చారని ఉండవల్లి అన్నారు. అంతేకాదు తిరుమలలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపిస్తే శ్రీవారి ప్రతిష్టదెబ్బతింటుందన్న సీఎం.. గతంలో వచ్చిన ఆరోపణలకు సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. మరి ఆనాడు శ్రీవారి ప్రతిష్ట గుర్తుకు రాలేదా అని ఉండవల్లి ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories