logo
సినిమా

‘విశ్వరూపం 2‌’ మూవీ రివ్యూ

‘విశ్వరూపం 2‌’ మూవీ రివ్యూ
X
Highlights

చిత్రం: విశ్వరూపం2 న‌టీన‌టులు: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా...

చిత్రం: విశ్వరూపం2
న‌టీన‌టులు: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ తదితరులు.
సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌
పాటలు: రామజోగయ్యశాస్త్రి
ఛాయాగ్ర‌హ‌ణం: శ్యాం ‌దత్, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్
కూర్పు: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి
సమర్పణ: వి.రవిచంద్రన్‌
నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్
రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌
సంస్థ: రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌
విడుదల: 10-08-2018

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో నటించి రూపొందిన చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం 'విశ్వరూపం 2'. ఆస్కార్‌ ఫిలిం (ప్రై) లిమిటెడ్‌ వి.రవిచంద్రన్‌ సమర్పణలో రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రూపొందిన చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విశ్వరూపం మాదిరిగానే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా అని తెలుసుకోవాలంటే విశ్వరూపం కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.

కథ ; ఇండియ‌న్ ‘రా’ ఆదేశాల మేర‌కు ప‌నిచేసే సైనిక గూఢ‌చారి విసామ్ అహ్మ‌ద్ క‌శ్మీరీ (క‌మ‌ల్‌హాస‌న్‌). అల్‌ఖైదా ఉగ్ర‌వాదుల‌తో క‌లిసి వాళ్ల వ్యూహాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు సైన్యానికి చేర‌వేస్తూ ప‌లు దాడుల్ని ఆపుతాడు. ఆ విష‌యం తెలిసిపోవ‌డంతో అల్‌ఖైదా ఉగ్ర‌వాది ఒమ‌ర్ ఖురేషి (రాహుల్ బోస్‌)... విసామ్‌ని అంతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు. అలాగే ఇండియాలో 64 చోట్ల బాంబు దాడులకు పాల్పడేందుకు వ్యూహాలు ర‌చిస్తాడు. యూకే స‌ముద్ర అంత‌ర్భాగంలో ఒక నావ‌లో ఉన్న బాంబుల్ని పేల‌కుండా అడ్డుకోవ‌డంతో పాటు, ఒమ‌ర్ ఖురేషిని విసామ్ ఎలా అంతం చేశాడు? నిరుప‌మ (పూజా కుమార్‌), అస్మిత (ఆండ్రియా), విసామ్‌కి ఎలా సాయం చేశారో తెర‌పైనే చూడాలి.

నటీనటులు : లోకనాయకుడు కమల్‌ హాసన్‌ మరోసారి అద్భుతమైన నటనతో సినిమాను నడిపించాడు. ఈ వయసులోనూ యాక్షన్‌ సీన్స్‌లో మంచి ఈజ్‌ కనబరిచారు. ఆయన బాడీ లాంగ్వేంజ్‌, డైలాగ్‌ డెలివరీ నిజంగా ఓ ‘రా’ ఏజెంట్‌నే చూస్తున్నామా అన్నంత నేచురల్‌గా ఉన్నాయి. హీరోయిన్లుగా కనిపించిన పూజా కుమార్‌, ఆండ్రియాలకు రెండు భాగంలోనూ ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయి. ముఖ్యంగా ఆండ్రియా యాక్షన్‌ సీన్స్‌లోనూ అదరగొట్టారు. విలన్‌గా రాహుల్ బోస్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో క్రూరమైన తీవ్రవాదిగా మెప్పించాడు. ఇతర పాత్రల్లో శేఖర్‌ కపూర్‌, జైదీప్‌, వాహీదా రెహమాన్‌ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేష‌ణ‌: క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిస్తూనే.. సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. విశ్వ‌రూపం పార్ట్ వ‌న్‌లో ప్రేక్ష‌కుల‌కు చాలా ప్ర‌శ్న‌లు మిగిలిపోయాయి. అయితే పార్ట్ వ‌న్ చాలా ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇక సీక్వెల్‌లో పార్ట్ వ‌న్‌లోని ప్ర‌శ్న‌ల‌న్నింటినీ క్లియ‌ర్ చేసినా.. స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేవు. యాక్ష‌న్‌సీన్స్ లో క‌మ‌ల్ హాస‌న్ ఎలాంటి డూప్‌లేకుండా చ‌క్క‌గా న‌టించారు. అయితే యాక్ష‌న్ పార్ట్ ఎగ్జ‌యిటింగ్‌గా ఎక్క‌డా అనిపించ‌దు. ఫ‌స్టాఫ్‌లో లండ‌న్ స‌ముద్రంలోని స‌న్నివేశాల్లోని సీజీ వ‌ర్క్ బావుంది. కానీ అస‌లు ఇండియాలో సినిమా స్టార్ట‌వుతుంద‌ని అనుకున్న ప్రేక్ష‌కుడికి సినిమా ఎటువెళుతుందో అనే సందేహం మొద‌ల‌వుతుంది. ఇక ఎడిటింగ్ షార్ప్‌గా లేదు. స‌న్నివేశాలు ల్యాగ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. క‌మ‌ల్ హాస‌న్ రాజ ఏజెంట్ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. పూజా కుమార్ పార్ట్ వ‌న్ కంటే దీంట్లో గ్లామ‌ర్ శాతం పెంచారు. ఆండ్రియా యాక్ష‌న్ సీన్స్‌కే ప‌రిమితం అయ్యింది. మొత్తంగా చూస్తే.. పార్ట్ వ‌న్ పై ఉన్న అంచ‌నాల‌తో విశ్వ‌రూపం 2 కి వ‌చ్చిన ప్రేక్ష‌కులు నిరాశ‌ను మిగిలుస్తుంది

Next Story