logo
ఆంధ్రప్రదేశ్

కేరళ వరద బాదితులకు అండగా రైల్వే అధికారులు

కేరళ వరద బాదితులకు అండగా రైల్వే అధికారులు
X
Highlights

కేరళ వరద బాదితులకు సహాయం అందించేందుకు రైల్వే అధికారులు ముందుకు వస్తున్నారు. విశాఖ లో కేరళీయుల, సీపీఎం పార్టీ...

కేరళ వరద బాదితులకు సహాయం అందించేందుకు రైల్వే అధికారులు ముందుకు వస్తున్నారు. విశాఖ లో కేరళీయుల, సీపీఎం పార్టీ సంయుక్తంగా వరద విరాళాలు సేకరిస్తున్నారు. వారి విజ్జప్తి మేరకు గురువారం ఉదయం కొళ్లాం ట్రైన్ లో వరద సహయ వస్తువులను పంపించేందుకు అంగీకరించారు. ప్రత్యేక కంటైనర్ ద్వారా సేకరించిన వస్తువులు, ఆహారపదార్ధాలు, దుస్తులు. మెడిసిన్స్ ను కేరళ ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో పాటు రైల్వే హెల్ప్ లైన్ ద్వారా సమాచారం అందించడం, రైల్వే పోలిస్, ఇతర సిబ్బంది సహయా సహకారాలు అందించనున్నారు. ఈ రెండు రోజులు నేరుగా ఎవరైనా విరాళాలు, వస్తువులు అందించాలనుకుంటే బుధవారం సాయంత్రం లోపు రైల్వేస్టేషన్ లో ఏర్పాటు చేసిన శిబిరంలో అందించవచ్చని అధికారులు తెలిపారు. వరద బాదితుల సహాయర్ధా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గోనాలని కేరళీయుల సంఘాలు పిలుపినిచ్చాయి.

Next Story