పుజారా ర‌నౌట్ పై సెహ్వాగ్ సెటైర్

పుజారా ర‌నౌట్ పై సెహ్వాగ్ సెటైర్
x
Highlights

ద‌క్షిణాఫ్రికా - భార‌త్ ల మ‌ధ్య జ‌రిగే టెస్ట్ మ్యాచ్ పూజారా బ్యాంటింగ్ పై సెహ్వాగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 335 ప‌రుగుల‌కే ఆలౌట్...

ద‌క్షిణాఫ్రికా - భార‌త్ ల మ‌ధ్య జ‌రిగే టెస్ట్ మ్యాచ్ పూజారా బ్యాంటింగ్ పై సెహ్వాగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 335 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. అనంత‌రం బ్యాటింగ్ కు దిగిన భార‌త్ అనుకున్న‌తంగా రాణించ‌లేక‌పోయింది. ఓపెనర్లు మురళీ విజయ్‌ 46;లోకేశ్‌ రాహుల్ 10 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. ఆ వెంటనే బ్యాటింగ్‌కు వచ్చిన నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా (0) అత్యంత ఘోరంగా రనౌట్‌ అయ్యాడు.
భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా మోర్నీమోర్కెల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ నాల్గో బంతిని ఎదుర్కొన్న పుజారా మిడాన్‌ మీదుగా ఆడాడు.
అయితే అదే క్రమంలో రాని పరుగు కోసం ప్రయత్నించాడు. అవతలి ఎండ్‌ నుంచి మురళీ విజయ్‌ వద్దని వారిస్తున్నా పరుగు కోసం వెళ్లాడు.ఆ స‌మ‌యంలో బౌల‌ర్ ఎంగిడి త్రో వేయ‌డంతో పూజారా ఔట్ అయ్యాడు. దీనిపై స్పందించిన సెహ్వాగ్ ఆ రనౌట్‌ చేసిన లుంగి ఎంగిడిని టార్గెట్‌ చేస్తూ సెటైర్‌ వేశాడు. అద్భుతమైన త్రో విసిరిన లుంగి ఎంగిడి.. తను లుంగీ డ్యాన్స్ చేస్తాడా..? లేక మన బ్యాట్స్‌మెన్ తో లుంగీ డ్యాన్స్‌ చేయిస్తాడా అంటూ ట్వీట్‌ చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories