‘సచిన్‌ రాముడైతే.. నేను హనుమంతుడిని’

‘సచిన్‌ రాముడైతే.. నేను హనుమంతుడిని’
x
Highlights

టీమిండియా మాజీ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లకు సంబంధించిన ఓ ఫొటో బాగా అలరిస్తోంది. తాజాగా సెహ్వాగ్‌ ఆ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌...

టీమిండియా మాజీ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లకు సంబంధించిన ఓ ఫొటో బాగా అలరిస్తోంది. తాజాగా సెహ్వాగ్‌ ఆ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ... 'సచిన్‌ రాముడైతే.. నేను హనుమంతుడిని' అని పేర్కొన్నారు. దానికి క్యాప్షన్‌గా.. ‘దేవుడితో ఉన్నప్పుడు..అతని పాదాల వద్ద ఉండటం బాగుంది.’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కు ఫిదా అయిన అభిమానులు.. అద్భుతమైన జోడి అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఓ అభిమానైతే ఏకంగా ‘సెహ్వాగ్‌ జీ.. మీరు సచిన్‌ నెంబర్‌ను మీ మొబైల్‌లో గాడ్‌జీ అని సేవ్‌ చేసుకున్నారా? దయచేసి సమాధానం ఇవ్వండి’ అని ప్రశ్నించాడు. 93 అంతర్జాతీయ వన్డేల్లో సచిన్‌, సెహ్వాగ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగి 42.13 సగటుతో 3,919 పరుగులు చేశారు. 12 సెంచరీ, 15 హాఫ్‌ సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పి అత్యధిక పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories