విరాట్ కొహ్లీ - అనుష్క శర్మల వివాహానికి కుదిరిన ముహూర్తం..?

Highlights

క్రికెట్ జగదేకవీరుడు విరాట్ కొహ్లీ, బాలీవుడ్ అతిలోక సుందరి అనుష్క శర్మల వివాహానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. గత కొద్ది సంవత్సరాలుగా డేటింగ్ చేస్తూ...

క్రికెట్ జగదేకవీరుడు విరాట్ కొహ్లీ, బాలీవుడ్ అతిలోక సుందరి అనుష్క శర్మల వివాహానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. గత కొద్ది సంవత్సరాలుగా డేటింగ్ చేస్తూ వచ్చిన కొహ్లీ, అనుష్క..డిసెంబర్ 9, 10, 11 తేదీలలో..ఏదో ఒకరోజు ఘనంగా...ఇటాలియన్ హంగులతో వివాహం చేసుకొనే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకొంది. శ్రీలంకతో ఈనెల 10 నుంచి జరిగే తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ లకు కొహ్లీ...దూరంగా ఉండడంతో...పెళ్లి వార్తలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. విరాట్ -అనుష్కల పెళ్లి ప్రోగ్రాం...ఫోటోగ్రాఫర్ల ద్వారా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో సౌతాఫ్రికా టూర్ కు కొహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వెళ్లనున్న కారణంగా....అంత హడావిడిగా కొహ్లీ వివాహం జరుగుతుందా? అన్న సందేహమూ లేకపోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories