logo
సినిమా

మెగా ఈవెంట్ లో ముఖ్య అతిధి కానున్న ఎన్టీఆర్

మెగా ఈవెంట్ లో ముఖ్య అతిధి కానున్న ఎన్టీఆర్
X
Highlights

రంగస్థలం సినిమా లో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు గా మన మనసులను దోచుకున్న రామ్ చరణ్ ఇప్పుడు 'వినయ విధేయ రామా' అనే...

రంగస్థలం సినిమా లో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు గా మన మనసులను దోచుకున్న రామ్ చరణ్ ఇప్పుడు 'వినయ విధేయ రామా' అనే కమర్షియల్ సినిమాతో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ క్లాస్ గా ఉన్నా సినిమా మాస్ గా ఉంటుందని టీజర్ చెప్పకనే చెప్పింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 27న యూసుఫ్ గూడా, హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఆ జరగనుంది. వందలాది మెగా ఫ్యాన్స్ ఈ మెగా వేడుకకు తరలిరానున్నారు.

అయితే ఈ సినిమా వేడుకలో ముఖ్య అతిథులుగా జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి విచ్చేయనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా సెట్స్ పైన ఉందన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చెర్రీ సినిమా వేడుక లో సందడి చేయనున్నారు రాజమౌళి మరియు ఎన్టీఆర్. కీయారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది.

Next Story