గ్రామాల ప్రజలకు కేంద్రం శుభవార్త..కీలక ప్రాజెక్ట్ కు టెండర్ల ఆహ్వానం..

గ్రామాల ప్రజలకు కేంద్రం శుభవార్త..కీలక ప్రాజెక్ట్ కు టెండర్ల ఆహ్వానం..
x
Highlights

దేశంలోని అన్ని గ్రామాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.4,000 కోట్ల పెట్టుబడి అంచనాతో దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 5 లక్షలకు పైగా...

దేశంలోని అన్ని గ్రామాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.4,000 కోట్ల పెట్టుబడి అంచనాతో దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 5 లక్షలకు పైగా వైఫై హాట్‌స్పాట్లు ఏర్పాటు చేయనుంది . ఈ మేరకు టెండర్లను ఆహ్వానించింది. భారత్‌నెట్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీకి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని అందుకోసం 5 లక్షలకు పైగా వైఫై హాట్‌స్పాట్లు అందివ్వడమే లక్ష్యమని డాట్‌ పేర్కొంది. ఇప్పటికే టెలికాం కమిషన్‌ నుంచి అనుమతి కూడా వచ్చింది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీలకు ప్రతి 1000 మందికి ఒక వైఫై హాట్‌స్పాట్‌, అలాగే 3500 మంది ఉంటే 2, 7,500 జనాభా వరకు 3, 12000 మందికి 4, 12,000 దాటితే 5 చొప్పున వైఫై హాట్‌స్పాట్‌లను ఇవ్వనుంది.ఈ పథకం గ్రామా ప్రజలకు, పోలీస్‌ స్టేషన్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, తపాలా కార్యాలయాల వంటి వాటిని అనుసంధానించడంకోసం ఉపయోగపడనుందని టెలికాం విభాగం (డాట్‌) తెలిపింది. ఇదిలావుంటే ఈ పనులు ఈ ఏడాది చివరిన లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories