రేపిస్ట్‌ను చితక్కొట్టిన జనం

x
Highlights

జగిత్యాల జిల్లా హుస్నాబాద్ లో ఓ రేపిస్ట్‌ను జనం చితక్కొట్టారు. అండర్ వేర్ పైనే అతడిని గ్రామ నేమ్ ప్లేట్ బోర్డుకు కట్టేసి పిడిగుద్దులు గుప్పించారు....

జగిత్యాల జిల్లా హుస్నాబాద్ లో ఓ రేపిస్ట్‌ను జనం చితక్కొట్టారు. అండర్ వేర్ పైనే అతడిని గ్రామ నేమ్ ప్లేట్ బోర్డుకు కట్టేసి పిడిగుద్దులు గుప్పించారు. రేపిస్టును విడిచిపెట్టామని అతడి కుటుంబీకులు వేడుకున్నా వినిపించుకోకుండా చితకబాదారు. నిన్న సాయంత్రం హుస్నాబాద్ లో ఓ జంట ఆటోలో వెళుతుంది. ఆ జంటను ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ యువకుడు వెంబడించాడు. పొదల్లోకి తీసుకెళ్లి యువతిని ముగ్గురు కలిసి అత్యాచారం చేశారు. ఈ అకృత్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.

ఈవాళ బాధిత యువకుడికి ముగ్గురు యువకులు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. లేకుంటే సెల్ ఫోన్ లో చిత్రీకరించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఫోన్ నెంబర్ ద్వారా కామాంధుల అడ్రసు తెలుసుకుని బాధితురాలి బంధువులు స్నేహితులు హుస్నాబాద్ వెళ్లారు. ఓ కామాంధుడిని పట్టుకుని బట్టలు ఉడదీశారు. అండర్ వేర్ పై అతడిని గ్రామ నేమ్ ప్లేట్ బోర్డుకు కట్టేసి చితకబాదారు. తప్పు అయింది విడిచిపెట్టామని రేపిస్టు కుటుంబీకులు కాళ్లు పట్టుకున్న వినిపించుకోలేదు. కామాంధుడిపై ఒకరి తర్వాత మరొకరు పిడిగుద్దులు గుప్పించారు. రేపిస్ట్ కు తగిన బుద్ధి చెప్పారని బాధితురాలి కుటుంబీకులను గ్రామస్తులు ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories