logo
సినిమా

సీనియ‌ర్ హీరోయిన్స్ తో విక్ర‌మ్‌

సీనియ‌ర్ హీరోయిన్స్ తో విక్ర‌మ్‌
X
Highlights

'అప‌రిచితుడు' చిత్రం రిలీజై ప‌న్నెండేళ్లు అయినా చియాన్ విక్ర‌మ్ కి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌డ‌నే...

'అప‌రిచితుడు' చిత్రం రిలీజై ప‌న్నెండేళ్లు అయినా చియాన్ విక్ర‌మ్ కి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌డ‌నే లేదు. గ‌త చిత్రం 'ఇరుముగన్' (తెలుగులో 'ఇంకొక్క‌డు')తో ఆ లోటు తీరుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఆశించిన ఫ‌లితం అయితే ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో గౌత‌మ్ మేన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'ధ్రువ న‌క్ష‌త్రం'తో క‌చ్చితంగా విక్ర‌మ్ కోరుకుంటున్న విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆయ‌న అభిమానులు ఆశిస్తున్నారు.

'పెళ్లి చూపులు' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ వ‌ర్మ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రెండు కీల‌క పాత్ర‌ల్లో ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ఆ ఇద్ద‌రు మ‌రెవ‌రో కాదు.. 80వ ద‌శ‌కంలో త‌న న‌ట‌న‌తో అల‌రించిన రాధిక ఒక‌రు కాగా.. మ‌రొక‌రు 90వ ద‌శ‌కంలో త‌న గ్లామ‌ర్‌తో అల‌రించిన సిమ్రాన్‌. మంచి తారాగ‌ణంతో, ఎట్రాక్టివ్ టైటిల్‌తో రూపొందుతున్న 'ధ్రువ నక్ష‌త్రం' అయినా విక్ర‌మ్ కోరుకుంటున్న హిట్ ఇస్తుందేమో చూడాలి.

Next Story