అవిశ్వాస తీర్మానంపై బొండా ఉమ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

అవిశ్వాస తీర్మానంపై బొండా ఉమ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
x
Highlights

ఏమో సోమ‌వారం లోపు ఏమైనా జ‌ర‌గొచ్చు అంటూ టీడీపీ నేత బొండా ఉమామహేశ్వ‌ర రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అంశంపై పోటీ ప‌డ్డ టీడీపీ...

ఏమో సోమ‌వారం లోపు ఏమైనా జ‌ర‌గొచ్చు అంటూ టీడీపీ నేత బొండా ఉమామహేశ్వ‌ర రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అంశంపై పోటీ ప‌డ్డ టీడీపీ - వైసీపీలు కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెడుతున్నాయి. శుక్ర‌వారం అవిశ్వాస‌తీర్మానం ప్ర‌వేశ‌పెట్టినా హౌస్ ఆఫ్ ఆర్డ‌ర్ లేద‌నంటూ స్పీక‌ర్ నోటీసును ర‌ద్దు చేశారు. సోమ‌వారం మ‌రోసారి అవిశ్వాస తీర్మానం పెట్టుకోమ‌ని సూచించారు.
ఈ సంద‌ర్భంగా టీడీపీ నేత బొంబా ఉమ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికే టీడీపీకి పదకొండు పార్టీలు మద్దతిచ్చాయి. సోమవారం వరకు ఏమైనా జరగొచ్చు అని అన్నారు. ఇప్పుడు బోండా బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ నుంచి బీజేపీ ఎంపీలు తిరుగుబాటు వరకు మాట్లాడారు. తాము సోమవారం అవిశ్వాసం ప్రవేశ పెడుతున్నామని, అప్పటి వరకు ఏమైనా జరగవచ్చునని ఆయన చెప్పారు. మోడీకి కేవలం మిత్రపక్షాలు మాత్రమే దూరం కాలేదని, బీజేపీలోని సీనియర్లను ఆయన దూరం పెట్టారని బోండా ఉమ అన్నారు.
మొన్న అగర్తలాలోని అసోం రైఫిల్స్‌ మైదానంలో పీఎం మోడీ - ఎల్కే అద్వానీ ల మ‌ధ్య జ‌రిగిన సంఘ‌ట‌నను గుర్తు చేసిన బొండా ఉమా.. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శతృఘ్ను సిన్హా వంటి వారిని పక్కన పెట్టారన్నారు. అప్పటి వరకు తారుమారు ఇటీవల ఉప ఎన్నికల్లోను బీజేపీ వరుసగా ఓడిపోతుందని బోండా ఉమ అన్నారు. సీనియర్లకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, ఈ నేపథ్యంలో బీజేపీ అసంతృప్తులు తిరుగుబాటు చేస్తే అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. సోమవారానికి తారుమారు కావొచ్చన్నారు.
పీఎం మోడీ - ఎల్కే అద్వానీ ల మ‌ధ్య జ‌రిగిన సంఘ‌ట‌న
భారతీయ జనతా పార్టీ అంటే, మొదట ఎవరికైనా గుర్తుకొచ్చేది అటల్ జీ, ఆ తరువాత అద్వాని. ఎందుకంటే ఈ రోజు బీజేపీ కాస్త నిలబడి అధికారం చేపట్టేదాకా వచ్చింది అంటే అందుకు నూటికి నూరుపాళ్ళు వీరిద్దరి కృషే తప్ప మరోటి కాదు.
కాషాయ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాల్లో అద్వానీ, వాజపేయిలను గుర్తు చేసుకుండా ఉండలేరు. కాని మోడీ, అమిత్ షాల ద్వయం, పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత అద్వానీకి అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయి. ఇటీవల త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అగర్తలాలోని అసోం రైఫిల్స్‌ మైదానంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని ఆహ్వానించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం అందరికి నమస్కారం చెబుతూ అద్వానీని పట్టించుకోకుండా అవమానించారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
మోడీ వేదికపైకి వస్తోన్న సమయంలో తమ పార్టీ నేతలందరికీ నమస్కరించారు. ఒక్క అద్వానీని మాత్రం పట్టించుకోలేదు. కనీస సంస్కారం లేకుండా, మోడీ వ్యవహారం నడించింది. రెండు చేతులతో అద్వానీ నమస్కారం చేస్తున్నప్పటికీ మోడీ ప్రతి నమస్కారం చేయకుండా వెళ్లిపోయారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వేదికపై ఉన్న మిగతా నాయకులందరితో ఆప్యాయంగా మాట్లాడి అద్వానీకి కనీసం నమస్కారం కూడా పెట్టలేదని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories