పీఎం కాళ్లుమొక్కిన విజ‌య‌సాయి..ఇదేనా మ‌న సాంప్ర‌దాయం

పీఎం కాళ్లుమొక్కిన విజ‌య‌సాయి..ఇదేనా మ‌న సాంప్ర‌దాయం
x
Highlights

వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి పై సీఎం చంద్ర‌బాబు మండిప‌డ్డారు. త‌న‌పై విజ‌య సాయి చేసిన వ్యాఖ్య‌లు దారుణ‌మ‌ని అన్నారు. నిన్న‌మీడియాతో మాట్లాడిన విజ‌య...

వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి పై సీఎం చంద్ర‌బాబు మండిప‌డ్డారు. త‌న‌పై విజ‌య సాయి చేసిన వ్యాఖ్య‌లు దారుణ‌మ‌ని అన్నారు. నిన్న‌మీడియాతో మాట్లాడిన విజ‌య సాయి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు.
ప్ర‌త్యేక‌హోదాపై చంద్ర‌బాబుకు చిత్త‌శుద్దిలేద‌ని క‌డిగిపారేశారు. టీడీపీ నేతలు దొంగలు , చంద్రబాబు గజ నేరగాడు , నిజం చెప్పాలంటే బ్యాంకులను టీడీపీ నేతలే దోచుకున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద నేరగాడు చార్లెస్ శోభరాజుకు చంద్రబాబు సమానం అని మండిపడ్డారు.
తాము గ‌త నాలుగేళ్లుగా ఏపీకి ప్ర‌త్యేక‌ హోదాకావాల‌ని పోరాటం చేస్తుంటే ..చంద్రబాబు తీరు దొంగతనం జరిగిన ఆరు నెలలకు కుక్క మొరిగినట్లుగా ఉందని విజయసాయి ఎద్దేవా చేశారు. హోదా కోసం ఏపీ ప్రజలు అందరూ గళమెత్తుతున్న సమయంలో చంద్రబాబు నిద్ర లేచారన్నారు. ఆయన యూటర్న్ తీసుకున్నారని, యూటర్న్ అంకుల్ అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో ఎలా మేనేజ్ చేసుకున్నాడో ఆయనకే తెలుసునని చెప్పారు.నన్ను నేరగాడు అంటావా.. నన్ను విజయ్ మాల్యాతో పోలుస్తావా, నేను బ్యాంకులను మోసం చేశానా.. అని చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. నేను ఏ బ్యాంకులోను లోన్ తీసుకోలేదన్నారు. ప్రపంచంలోని గజదొంగ చార్లెస్ శోభరాజ్ అని, ఆయనతో సమానం చంద్రబాబు అన్నారు.
అయితే బుధ‌వారం టీడీపీ ఎంపీల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విజ‌యసాయి చేసిన వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు మండిప‌డ్డారు. వైసీపీ ఎంపీ ప్ర‌ధాని కాళ్ల‌కు మొక్క‌డం భార‌తీయ సాంప్ర‌దాయమా అని ప్ర‌శ్నించారు. తల్లిదండ్రులు ఎవరికైనా దైవసమానులని, దేవుళ్ల పటాలతో పాటు పెట్టి పూజిస్తామని, అటువంటి తల్లిదండ్రులను నిందించడం దుర్మార్గ‌మ‌ని అన్నారు. విజ‌య‌సాయి వ్యాఖ్య‌లు దుర్మార్గానికి ప‌రాకాష్ట అని దుయ్య‌బ‌ట్టారు. ఇలాంటి వారినా పీఎంవో కార్యాల‌యం చేర‌దీసేది. అయినా స‌రే రాష్ట్రం కోసం , రాష్ట్ర ప్ర‌జ‌ల‌కోసం ఎన్నైనా స‌హిస్తాన‌ని చంద్ర‌బాబు పున‌రుద్ఘాటించారు.
అంతేకాదు ఢిల్లీకి వ‌చ్చిన కొంత‌మంది ఎంపీలు స‌హ‌కరించ‌డంలేద‌ని, అలాస‌హ‌క‌రించ‌క‌పోతే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. ఢిల్లీలోని ఏపీ ఏపీ భ‌వ‌న్ ను స‌మ‌న్వ‌య వేదిక‌గా వాడుకోవాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీ వేదిక‌గా తాను చేసిన ప‌నుల గురించి ప్ర‌స్తావించారు. తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు జార్ఖండ్ బాధితుల్ని ఆదుకున్నామ‌ని , ఢిల్లీలో ఉన్న‌వారు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.
టీడీపీ ఎంపీలు ఎవ‌రితోనూ ర‌హ‌స్యంగా చ‌ర్చించ‌వ‌ద్ద‌ని, తెలిసి చేసినా , తెలియ‌క చేసినా త‌ప్పుత‌ప్పేన‌ని అన్నారు. ప్ర‌త్యేక‌హోదా అంశం ఐదు కోట్ల మంది ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విషయమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఈ రోజు నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించాలని ఆయన ఆదేశించారు. మరింత కష్టపడడం ద్వారా నిరసనలు తెలిపాలని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories