చంద్ర‌బాబును చార్లెస్ శోభరాజ్ తో పోల్చిన విజ‌య‌సాయి

చంద్ర‌బాబును చార్లెస్ శోభరాజ్ తో పోల్చిన విజ‌య‌సాయి
x
Highlights

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సీఎం చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. న‌న్ను మాల్యాతో పోల్చాతారా అని ప్ర‌శ్నించిన విజ‌య‌సాయి...

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సీఎం చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. న‌న్ను మాల్యాతో పోల్చాతారా అని ప్ర‌శ్నించిన విజ‌య‌సాయి ..ప్ర‌త్యేక‌హోదాపై చంద్ర‌బాబుకు చిత్త‌శుద్దిలేద‌ని క‌డిగిపారేశారు. టీడీపీ నేతలు దొంగలు , చంద్రబాబు గజ నేరగాడు , నిజం చెప్పాలంటే బ్యాంకులను టీడీపీ నేతలే దోచుకున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద నేరగాడు చార్లెస్ శోభరాజుకు చంద్రబాబు సమానం అని మండిపడ్డారు. ఇక ప‌దే ప‌దే పీఎంవోలో విజ‌య్ సాయిరెడ్డి ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంపై స్పందించిన ఆయ‌న ఎన్టీఏపై అవిశ్వాస తీర్మానం ప్ర‌క‌టించిన త‌రువాత తాను క‌ల‌వ‌లేద‌ని చెప్పుకొచ్చారు.
తాము గ‌త నాలుగేళ్లుగా ఏపీకి ప్ర‌త్యేక‌ హోదాకావాల‌ని పోరాటం చేస్తుంటే ..చంద్రబాబు తీరు దొంగతనం జరిగిన ఆరు నెలలకు కుక్క మొరిగినట్లుగా ఉందని విజయసాయి ఎద్దేవా చేశారు. హోదా కోసం ఏపీ ప్రజలు అందరూ గళమెత్తుతున్న సమయంలో చంద్రబాబు నిద్ర లేచారన్నారు. ఆయన యూటర్న్ తీసుకున్నారని, యూటర్న్ అంకుల్ అని ఎద్దేవా చేశారు.
ఏపీకి ద్రోహం చేసిన వ్యక్తిగా చంద్రబాబు మిగిలిపోతాడని విజయ సాయి రెడ్డి అన్నారు. చంద్రబాబే ఓ నేరగాడు . కొన్ని కేసుల్లో స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఎలా మేనేజ్ చేసుకున్నాడో ఆయనకే తెలుసునని చెప్పారు.
టీడీపీలోని చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు నేరగాళ్లు అని విజయ సాయి రెడ్డి అన్నారు. ఆ నేరగాళ్లకు అధినేత గజనేరగాడు చంద్రబాబు ఆరోపించారు. నన్ను నేరగాడు అంటావా.. నన్ను విజయ్ మాల్యాతో పోలుస్తావా, నేను బ్యాంకులను మోసం చేశానా.. అని చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. నేను ఏ బ్యాంకులోను లోన్ తీసుకోలేదన్నారు. ప్రపంచంలోని గజదొంగ చార్లెస్ శోభరాజ్ అని, ఆయనతో సమానం చంద్రబాబు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories