logo
సినిమా

విజయ్ దేవరకొండకు మరో ఎదురుదెబ్బ..

విజయ్ దేవరకొండకు మరో ఎదురుదెబ్బ..
X
Highlights

ఎన్నికేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా లీకు వీరులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ‘అరవింద సమేత వీర రాఘవ’...

ఎన్నికేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా లీకు వీరులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో సీన్లను లీక్ చేసిన దుండగులు.. విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ సినిమాను రిలీజ్ కు ముందే బయటపెట్టారు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా ‘ట్యాక్సీవాలా’కు షాక్ తగిలింది. ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ ను కొందరు దుండుగులు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. నిర్మాణ సంస్థ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు గూగుల్ డ్రైవ్ నుంచి సినిమా లీక్ అవుతున్నట్లు గుర్తించారు. రెల్ల కమల్, భార్గవ్ కుమార్, బీఆర్ పేర్లతో ఉన్న జీ-మెయిల్ అకౌంట్ల ద్వారా ఈ వీడియో లింక్ లు షేర్ అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల విడుదలైన ‘గీత గోవిందం’ సినిమా కూడా లీకైన విషయం విదితమే.

Next Story