2019 లో వెంకీ హంగామా

2019 లో వెంకీ హంగామా
x
Highlights

ఇప్పుడున్న సీనియర్ హీరోలతో పోలిస్తే ఎక్కువ సినిమాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే అది విక్టరీ వెంకటేష్ దగ్గర అని చెప్పుకోవచ్చు. చివరికి యంగ్ హీరోలు సైతం...

ఇప్పుడున్న సీనియర్ హీరోలతో పోలిస్తే ఎక్కువ సినిమాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే అది విక్టరీ వెంకటేష్ దగ్గర అని చెప్పుకోవచ్చు. చివరికి యంగ్ హీరోలు సైతం సంవత్సరానికి ఒక సినిమాతో మన ముందుకు వస్తుంటే వెంకీ మాత్రం కనీసం రెండు సినిమాలను విడుదల చేస్తున్నాడు. ఈ సంవత్సరం వెంకీ సినిమా ఏది విడుదల కాకపోయినా గతేడాది విడుదలైన 'గురు' సినిమా పెద్ద హిట్ అయింది. వెంకీ, వరుణ్ తేజ్ నటించిన మల్టీ స్టారర్ సినిమా 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా మరియు మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే 2019లో ఈ సినిమా కాకుండా వెంకీ మరొక రెండు సినిమాలను విడుదల చేయబోతున్నాడట. నాగచైతన్యతో చేసే 'వెంకీ మామ' పక్కన పెడితే, వెంకీ సోలో హీరోగా నటిస్తున్న 2 ఇంట్రస్టింగ్ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రెండూ చాలా ఆసక్తికరంగా సాగే కథలని, ఇవి కచ్చితంగా హిట్ అయి తీరుతాయని వెంకీ గట్టి నమ్మకంతో ఉన్నాడని సమాచారం. ఈ సినిమాల గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories